ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: బడుగు, బలహీనర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే అని ఆయన చేసిన సేవలు ఎనలేనివని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. మహాత్మా జ్యోతిబా ఫూలే 198 వ జయంతి సందర్భంగా షాద్ నగర్ బ్లాక్ ఆఫీస్ వద్ద షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. భారత ప్రధమ సామజిక తత్వవేత్త, సమన్యాయ సత్యశోధకుడు, మహిళా అభ్యదయవాది.. నిరంతరం మహిళల విద్యాభివృద్ధికై.. పాటు పడిన ఆదర్శప్రాయుడు.. బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి, గొప్ప సంఘ సంస్కర్త జ్యోతి బా పులే అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సభ్యులు శ్యాంసుందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నేతలు చెంది తిరుపతి రెడ్డి, రఘు నాయక్, కొంకళ్ల చెన్నయ్య, అగ్గనురు బశ్వం, చల్లా శ్రీకాంత్ రెడ్డి, గుండ్రాతి బాలరాజు గౌడ్, కౌన్సిలర్ శ్రీనివాస్, రాజేందర్ రెడ్డి, రాయికల్ శ్రీనివాస్, అందే మోహన్, తుపాకుల శేఖర్, బాధేపల్లి సిద్దార్థ, జాంగారి రవి, కొప్పనుర్ ప్రవీణ్, బచ్చలి నరేష్, సోలిపుర్ రాజేష్ గౌడ్, లింగారెడ్డి గూడ అశోక్, నందిగామ శంకర్, రవి, చటాన్ పల్లి శేఖర్, శ్రీహరి గౌడ్, తదితరులు పాల్గొన్నారు.