ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: మణిపుర్ సీఎం బీరెన్ సింగ్ కాన్వాయ్‌పై మిలిటెంట్లు దాడి చేశారు. ఈ ఘటనలో ఓ భద్రతా సిబ్బంది గాయపడ్డారు. కాంగ్పోక్పీ జిల్లాలో ఈ ఘటన జరిగింది. జిరిబామ్ ప్రాంతంలో రేపు సీఎం పర్యటించనున్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించేందుకు సెక్యూరిటీ బృందం ఆ ప్రాంతానికి బయలుదేరింది. ఈ క్రమంలో మిలిటెంట్లు కాన్వాయ్‌పై ఆకస్మిక దాడికి పాల్పడ్డారు. కాగా జిరిబామ్‌లో ఇటీవల మిలిటెంట్లు 70కిపైగా ఇళ్లకు నిప్పుపెట్టారు.