Trending Now

“అడిక్షన్ సైకియాట్రీ” పై జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న సదస్సుపై రూపొందించిన బ్రోచర్‌ను ఆవిష్కరించిన మంత్రి..

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: జూన్ 22 – 23 తేదీలలో నిజామాబాద్ పట్టణంలో ‘ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ తెలంగాణ స్టేట్ బ్రాంచ్ ‘ ఆధ్వర్యంలో “అడిక్షన్ సైకియాట్రీ” పై జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న సదస్సుపై రూపొందించిన బ్రోచర్‌ను రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి దామోదర్ రాజనర్సింహ హైదరాబాద్‌లోని తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డ్రగ్స్ మహమ్మారి నిర్మూలనపై యువతలో సామాజిక చైతన్యం, అవగాహన కల్పించడానికి నిజామాబాద్‌లో ‘ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ తెలంగాణ స్టేట్ చాప్టర్’ ఆధ్వర్యంలో “అడిక్షన్ సైకియాట్రి” పై నిర్వహిస్తున్న జాతీయ స్థాయి సదస్సు విజయవంతం కావాలని ఆకాంక్షించారు. సదస్సును నిర్వహిస్తున్న నిర్వాహకులను మంత్రి ఈ సందర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ తెలంగాణ స్టేట్ బ్రాంచ్ జనరల్ సెక్రటరీ డా. విశాల్ ఆకుల, ఎర్రగడ్డ మానసిక వైద్యశాల సూపరింటెండెంట్ డా. ఎం. ఉమా శంకర్, ఆర్గనైజింగ్ చైర్ పర్సన్ డా. జార్జి రెడ్డి, డా. ఫని కాంత్, డా. రవితేజ ఇన్నమూరి, డా. అశోక్ అలిమ్ చందాని, తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News