Trending Now

పది ఏండ్ల కాలంలో హిందూ సమాజానికి చేసింది శూన్యం : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: పది ఏండ్ల కాలంలో హిందూ సమాజానికి చేసింది శూన్యమని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. గాంధీ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ముస్లిం ల రిజర్వేషన్లు తీయాలని చూస్తుందని ఆయన ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ ల హక్కులను పొందకుండా మోడీ ప్రభుత్వం చూస్తుందని.. ఆర్థిక వెనుకబాటు తనం అనే నెపంతో ఈడబ్లూఎస్ రిజర్వేషన్లు తీసుకొస్తున్నారు. దీంతో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు దానిలో రిజర్వేషన్ కల్పించాలి. వివక్షతతో వాళ్ళ హక్కులను కాల రాస్తున్నారు. దళితులు గా వాళ్ళు పుట్టడమే తప్పా..? అని ఆయన ప్రశ్నించారు. ఎందుకు వాళ్ళ రిజర్వేషన్లు తొలగించాలని చూస్తున్నారని పైరయ్యారు. పది ఏండ్ల లో హిందువులకు మీరు ఎంత రిజర్వేషన్ ఇచ్చారని ప్రశ్నించారు. దేశంలో 52 % రిజర్వేషన్లు ఉంటే ఎస్సీ 15 % , ఎస్టీ 10% బలహీన వర్గాలు 50 శాతం ఉన్నారు. మిగిలింది 25 శాతంలో హిందు సమాజం, ముస్లిం సమాజం ఉంది. ఇప్పటి వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఎంత రిజర్వేషన్లు ఇచ్చారని ప్రశ్నించారు.

Spread the love

Related News

Latest News