ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరోసారి చుక్కెదురైంది. లిక్కర్ స్కాం కేసులో కవితకు ఈనెల 23వ తేదీ వరకు జ్యుడీషియల్ కస్టడీని విధించింది రౌస్ ఎవెన్యూ కోర్టు. దీంతో సీబీఐ అధికారులు ఆమెను తీహార్ జైలుకు తరలించారు. మరో 14 రోజులు కస్టడీ పొడిగించాలని సీబీఐ కోరగా.. కోర్టు మాత్రం 9 రోజుల కస్టడీకి అనుమతించింది. ఈ నేపథ్యంలో ఈనెల 23వ తేదీ వరకు కవితకు కోర్టు కస్టడీని పొడిగించింది.
లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత అరెస్టై నేటికి నెల రోజులైంది. మార్చి 15న HYDలోని ఆమె నివాసంలో ఈడీ అధికారులు కవితను అదుపులోకి తీసుకున్నారు. 10 రోజుల కస్టడీ అనంతరం మార్చి 26న ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు జుడీషియల్ రిమాండ్ విధించడంతో తిహార్ జైలుకు తరలించారు. ఇదే కేసులోకి రంగప్రవేశం చేసిన సీబీఐ ఆమెను ఈ నెల 12న మరోసారి అరెస్ట్ చేసింది. తాజాగా ఏప్రిల్ 23 వరకు కోర్టు జుడీషియల్ కస్టడీ విధించింది.
కవిత విచారణకు సహకరించలేదు: సీబీఐ
మూడు రోజుల కస్టడీలో విచారణకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సహకరించలేదని సీబీఐ రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొంది. శరత్ చంద్ర నుంచి తీసుకున్న నగదుపై ప్రశ్నించామని.. పొంతన లేని జవాబులు చెప్పారని తెలిపింది. దర్యాప్తును, సాక్షులను ప్రభావితం చేయగల వ్యక్తి కవిత అని ఆరోపించింది. ఆమె బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని జుడీషియల్ కస్టడీ కోరినట్లు తెలిపింది.