Trending Now

పార్లమెంట్ ఇంచార్జీల సమీక్ష సమావేశం..

ఖానాపూర్ నుండి మైనార్టీ విభాగం నాయకులు

నిర్మల్ (ప్రతిపక్షం జిల్లా ప్రతినిధి) ఏప్రిల్, 15 : నిర్మల్ జిల్లా ఖానాపూర్, ముధోల్ నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ మైనార్టీ విభాగం జిల్లా రాష్ట్ర, స్థాయి లోక్ సభ ఎన్నికల పార్లమెంటరీ కో కన్వీనర్లు ఇన్చార్జీలు సోమవారం కరీంనగర్ లో నిర్వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర పార్లమెంటరీ స్థాయి కాంగ్రెస్ మైనార్టీ విభాగం అబ్జర్వర్ ల సమావేశనికి తరలి వెళ్లారు. కాంగ్రెస్ నాయకులు ఈ సందర్భంగా రాష్ట్ర సమావేశానికి వెళుతూ.. ఖానాపూర్ వచ్చిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పార్లమెంటరీ ఎన్నికల కో కన్వీనర్ నిర్మల్ జిల్లా కాంగ్రెస్ మైనార్టీల ప్రధాన కార్యదర్శి ఎం.ఏ లతీఫ్ ఈ సందర్భంగా అబ్జర్వేషన్స్ సమావేశంలో చర్చించవలసిన విషయాలు, ఎన్నికలలో తీసుకోవాల్సిన నిర్ణయాలు ముస్లిం మైనారిటీల ఓట్ల సాధన తదితర విషయాలపై చర్చించారు. వారితో పాటు బోథ్ అబ్జర్వర్ సద్దాం, ఖానాపూర్ మైనార్టీ విభాగం అబ్జర్వర్ షబ్బీర్ పాషా, మైనార్టీ మండల అధ్యక్షులు సలీం ఖాన్, మైనార్టీ నాయకులు సయ్యద్ ఆయుబ్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News