Trending Now

నిషేధిత గుట్కా పట్టివేత..

ప్రతిపక్షం, హుస్నాబాద్, జూన్ 1: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో ప్రభుత్వం నిషేధించిన గుట్కాలు అంబర్, బ్లూబుల్, ఎడి, బ్లాక్ సిగరెట్స్ విలువ తొమ్మిది వేల రూపాయల విలువ గలవి చాకచక్యంగా సిద్దిపేట టాస్క్ ఫోర్స్ & హుస్నాబాద్ పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్బంగా నిందితుడు గౌరిశెట్టి రవీందర్ హుస్నాబాద్ పట్టణంలొ శనివారం రోజున మధ్యాహ్నం సమయమున పై నిందితుడు తన మహేశ్వర హోల్ సేల్ కిరాణా షాప్ లో ప్రభుత్వం నిషేధించిన గుట్కాలు అమ్ముతున్నారని నమ్మదగిన సమాచారం రాగా టాస్క్ ఫోర్స్ అధికారులు సిబ్బంది హుస్నాబాద్ ఎస్ఐ కలసి కిరాణా షాపులో తనిఖీలు నిర్వహించగా.. ప్రభుత్వం నిషేధించిన గుట్కాలు అంబర్, బ్లూబుల్, గుట్కా ప్యాకెట్లు బ్లాక్ సిగరెట్స్ మొత్తం విలువ తొమ్మిది వేల రూపాయల గలవి స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఈ సందర్భంగా టాస్క్ ఫోర్స్ పోలీస్ అధికారులు మాట్లాడుతూ.. సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఆదేశానుసారం జిల్లాలో ఎక్కడైనా ప్రభుత్వ అనుమతి లేకుండా ఇసుక, పిడిఎస్ రైస్ అక్రమ రవాణా చేసిన నిల్వ ఉంచిన, చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జూదం, గ్యాంబ్లింగ్ చట్ట వ్యతిరేక కార్యక్రమాలపై ప్రభుత్వం నిషేధించిన గుట్కాలపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలు ఎవరైనా నిర్వహిస్తున్నట్లు తెలిస్తే సిద్దిపేట టాస్క్ ఫోర్స్ అధికారుల నెంబర్లు 8712667445, 8712667446, 8712667447 లకు సమాచారం అందించాలని సూచించారు. సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచడం జరుగుతుందాన్నారు.

Spread the love

Related News

Latest News