Trending Now

నా జీవితం తెరిచిన పుస్తకం.. ప్రధాని మోదీ

మోదీ గ్యారంటీ అంటే.. ఖచ్చితంగా అమలయ్యే గ్యారంటీ

ఇది ఎన్నికల సభ కాదు.. అభివృద్ధి ఉత్సవం

ప్రజల్లో ఉత్సహాన్ని నింపిన ప్రధాని మోదీ ప్రసంగం

ఆదిలాబాద్​ నుంచి ప్రతిపక్షం ప్రత్యేకప్రతినిధి: నా జీవితం తెరిచిన పుస్తకం అని, మోదీ గ్యారంటీ అంటే ఖచ్చితంగా అమలవుతుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలిపారు. సోమవారం ఆదిలాబాద్‌లో నిర్వహించిన బీజేపీ విజయ సంకల్ప యాత్రలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం అది నుంచి చివరి వరకు ప్రజల్లో, పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపింది. వికసిత్‌ భారత్‌ కోసం తమ పార్టీ చేస్తున్న కృషిని ప్రధాని నరేంద్ర మోదీ వివరించారు. ఇది ఎన్నికల సభ కాదని.. అభివృద్ధి ఉత్సవమని స్పష్టం చేశారు. కేంద్రంలో మరోసారి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. ఈసారి బీజేపీకి 400 సీట్లు వస్తాయని తెలంగాణలోని అదిలాబాద్ వేదికగా ఎన్నికల సమరశంఖం పూరించారు. మోదీ గ్యారంటీ అంటే.. పూర్తి చేసే గ్యారంటీ అని అంతా అనుకుంటున్నారని ప్రధాని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌, బీఆర్ఎస్ పార్టీపై మోదీ పలు విమర్శలు చేశారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయిందని ప్రదాని మోదీ సెటైర్లు వేశారు. ఈ ప్రాజెక్టు విషయంలో బీఆర్‌ఎస్‌తో కాంగ్రెస్‌ కుమ్మక్కవుతోందని విమర్శించారు.

రెండు కుటుంబ పార్టీల చరిత్ర ఒక్కటేనన్నారు ప్రధాని మోదీ. కుటుంబ పార్టీల్లో ఉండేది రెండే ఒకటి దోచుకోవడం, రెండు అబద్ధాలు చెప్పడమేనని విమర్శించారు మోదీ. ఆదివాసీలకు గౌరవం దక్కితే, కుటుంబ పార్టీలు భరించలేకపోతున్నాయని ప్రధాని మోదీ విమర్శించారు. ఆదివాసీల అభ్యున్నతి కోసం నిర్ణయాలు తీసుకుంటే, వాటిని ఈ పార్టీలు విమర్శించారని మోదీ తప్పుబట్టారు. దేశవ్యాప్తంగా 15 రోజుల్లో 5 అత్యాధునిక ఎయిమ్స్‌ ఆసుపత్రులను ప్రారంభించినట్లు మోదీ తెలిపారు. ఆదివాసీ మహిళను రాష్ట్రపతిని చేసిని ఘనత బీజేపీకే దక్కుతుందన్నారు. తెలంగాణలో సమ్మక్క-సారక్క పేరుతో గిరిజన విశ్వవిద్యాలయాన్ని స్థాపించామన్నారు. దేశాన్ని అభివృద్ధి చేయడానికి రోజంతా కృషి చేస్తున్నామని ప్రధాని మోదీ అన్నారు. అభివృద్ధి చెందిన భారత్‌లో దేశంలోని యువత అత్యధికంగా లబ్ధి పొందుతున్నారన్నారు. 140 కోట్ల భారత ప్రజల కలల సాకారం కోసం పనిచేస్తానన్నా ప్రధాని మోదీ, మోదీ గ్యారంటీ అంటే.. ఖచ్చితంగా అమలయ్యే గ్యారంటీ అని స్పష్టం చేశారు. దేశంలో 7 మెగా టెక్స్‌టైల్‌ పార్కులు ఏర్పాటు చేయబోతున్నట్లు మోదీ స్పష్టం చేశారు. అందులో ఒకటి తెలంగాణలో రాబోతున్నట్లు మోదీ తెలిపారు. ఆదిలాబాద్ సభలో ప్రధాని మోదీ తెలుగులో మాట్లాడారు. ఈసారి 400 సీట్లు సాధించిపెట్టాలని ఆయన ప్రజలను కోరారు. మోదీ తెలుగులో మాట్లాడినపుడు చప్పట్లతో సభ హోరెత్తింది. మోదీ తన ప్రసంగంలో పలుమార్లు తెలుగులోనే మాట్లాడటం ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంది.

Spread the love

Related News

Latest News