Pune court summons Rahul Gandhi: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి పుణె ప్రత్యేక కోర్టు సమన్లు జారీ చేసింది. గతేడాది లండన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో రాహుల్ మాట్లాడుతూ వినాయక్ దామోదర్ సావర్కర్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేసినట్లుగా సావర్కర్ మనవడు సత్యకి సావర్కర్ గతంలో పుణెలోని ఓ కోర్టులో పరువు నష్టం దావా దాఖలు చేశారు. దీనిపై శుక్రవారం విచారణ జరిపిన కోర్టు అక్టోబర్ 23న తమ ముందు హాజరు కావాలని కోరుతూ రాహుల్‌కు సమన్లు జారీ చేసింది.