Trending Now

‘ఎన్నికల విధి నిర్వహణ ధ్రువపత్రాలు అందజేయండి’

ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, మే 17 : నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గ పరిధిలో ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల విధులు నిర్వహించిన ఉద్యోగ, ఉపాద్యాయులకు ఎన్నికలు జరిగి నాలుగు రోజులు అవుతున్న ఎన్నికల విధి నిర్వహణ ధ్రువపత్రాలను అందజేయకపోవడంపై ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే సంబంధిత శాఖల ఉన్నత స్థాయి అధికారులు గుర్తించి ఎన్నికల విధులు నిర్వహించిన వారికి విధి నిర్వహణ అధికారిక ధ్రువీకరణ పత్రాలను అందజేయాలని కోరారు. ఈ మేరకు ఎస్టీయు రాష్ట్ర శాఖ నాయకులు నాంపల్లి నాగభూషణ్ ఆధ్వర్యంలో ఎస్టీయు భైంసా మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పిప్పర్ శ్రీనివాస్, గోరేకర్ శంకర్ లు శుక్రవారం బైంసా రాజ్యసభ మండల అధికారి కు వినతి పత్రాన్నిసమర్పించారు.

Spread the love

Related News

Latest News