ప్రతిపక్షం, ఏపీ: ఏపీ లో రానున్న ఎన్నికల్లో బరిలోకి దిగబోయే టీడీపీ-జనసేన అభ్యర్థుల మొదటి జాబితా ఈ రోజు విడుదల కానుంది. 60-70 అసెంబ్లీ స్థానాలపై ప్రకటన ఉండే అవకాశం కనిపిస్తుండగా.. టీడీపీ నుంచి 50కి పైగా జనసేన నుంచి 10కి పైగా స్థానాల్లో అభ్యర్థుల ప్రకటన వెలవడనుంది. ముందుగా రెండు పార్టీల మధ్య వివాదాలు లేని స్థానాలపై ప్రకటన ఉండబోతున్నట్లు తెలుస్తోంది.