Trending Now

ఆయన గెలిస్తేనే.. మా బ్రతుకులు మారుతాయి..

కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్‌కు మద్దతు పలికిన ప్రైవేట్ విద్యా సంస్థల ఉపాధ్యాయులు, యాజమాన్యాలు

ప్రతిపక్షం, కరీంనగర్, ఏప్రిల్ 23: కరీంనగర్ ఎంపీగా విద్యావంతుడు.. ప్రజల బాధలు.. ప్రయివేట్ ఉపాధ్యాయుల సమస్యలు తెలిసిన వ్యక్తి అయినటువంటి బోయినపల్లి వినోద్ కుమార్ గెలిస్తేనే తమ బ్రతుకుల్లో చీకటి తొలిగి.. కొత్త వెలుగులు వస్తాయని.. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బోయినపల్లి వినోదన్ననే ఎంపీగా గెలిపిస్తామని ఊరూరా తిరిగి ప్రజలను చైతన్యం చేస్తామని ప్రయివేట్ విద్యాసంస్థల 40 వేల మంది ఉపాధ్యాయులు, విద్యాసంస్థల యాజమాన్యాలు తెలిపారు. మంగళవారం కరీంనగర్ లోని మైత్రి హోటల్ లో ట్రస్మా ముఖ్య సలహాదారుడు యాదగిరి శేఖర్ రావు ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా యాదగిరి శేఖర్ రావు మాట్లాడుతూ.. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి విద్యా పన్ను కట్టడం జరుగుతుందని, ఇప్పటి వరకు 11 లక్షల వేల కోట్లు విద్యాపన్ను రూపంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేశాయని పేర్కొన్నారు.

ఈ పన్ను ద్వారా వసూలు చేసిన డబ్బులు విద్యా వ్యవస్థకు ఖర్చు పెట్టాలని అన్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో పని చేసే ఉపాధ్యాయులకు 10లక్షల ఇన్సూరెన్స్ తో పాటు హెల్త్ కార్డులు ఇవ్వాలన్నారు.చాలీచాలని వేతనాలతో ప్రయివేట్ ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. 2018లో కరీంనగర్ ఎంపీగా ఉన్న బోయినపల్లి వినోద్ కుమార్ గారు చట్టం కోసం పార్లమెంటు లో ప్రయివేట్ బిల్లుకు ప్రతిపాదన చేశారు. ప్రభుత్వ ఉపాధ్యాయుల మాదిరిగా హెల్త్ రీయింబర్స్ మెంట్ కల్పించాలని పేర్కొన్నారు. దేశంలోని 18 లక్షల మందికి ఎన్ఐ ఓఎస్ ద్వారా డీఎల్ఈడీ అభ్యర్థులకు ఉచితంగా కోచింగ్ ఇప్పించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వేణుగౌడ్, రమేష్, రవిందర్ రెడ్డి, మధుసూదన్, రవి, రాజుయాదవ్, భరత్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News