ప్రతిపక్షం, వెబ్ డెస్క్: కుప్పం పట్టణంలో చంద్రబాబు పర్యటన కొనసాగుతుంది. ప్రపంచం శరవేగంగా మారుతుందని.. మారుతున్న సాంకేతికతను యువత అందిపుచ్చుకోవాలని చంద్రబాబు అన్నారు. కరెంట్ లేని కాలం నుంచి మీ ఇంట్లోనే కరెంట్ ఉత్పత్తి చేసుకునే పరిస్థితి వచ్చిందన్నారు. యువత బంగారు బాటలో నడవాలి.. నేటి యువతకు వివేకానందుడిని ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. కుప్పంలో 1989లో టెలిఫోన్ ఎక్స్ ఛేంజ్ ఏర్పాటు చేయించినట్లు ఈ సందర్భంగా గుర్తు చేశారు.