BRS: గాంధీ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత.. బీఆర్ఎస్ నేతలు అరెస్ట్

BRS leaders arrested: హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా ఆసుపత్రుల్లో నెలకొన్న పరిస్థితులపై అధ్యయనం చేసేందుకు వెళ్లిన బీఆర్‌ఎస్‌ నిజనిర్ధారణ కమిటీ సభ్యులు, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్టు చేశారు. మాజీ ఉపముఖ్యమంత్రి రాజయ్యతో పాటు మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌, ఎమ్మెల్యేలు డాక్టర్‌ సంజయ్‌, మాగంటి గోపీనాథ్‌ను అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. పోలీసు వాహనాన్ని అడ్డుకునేందుకు బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ప్రయత్నించారు.

Spread the love

Related News