ప్రతిపక్షం, జూలై 20: మానవ చరిత్రలో అద్భుత ఘట్టంగా నిలిచిన చంద్రుడిపై తొలి అడుగును గుర్తుచేసుకుంటూ నేడు అంతర్జాతీయ చంద్ర దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 1969 జూలై 20న అపోలో-11 మిషన్ ద్వారా నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్, బజ్ ఆల్డ్రిన్ తొలిసారిగా చంద్రుడిపై అడుగుపెట్టి చరిత్ర సృష్టించారు.
అంతరిక్ష పరిశోధనల ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటిచెప్పడంతో పాటు చంద్రుడిపై మానవ అన్వేషణను ప్రోత్సహించడమే ఈ దినోత్సవం ప్రధాన ఉద్దేశం. ఈ చారిత్రక ఘట్టాన్ని గుర్తుచేసుకుంటూ ఐక్యరాజ్యసమితి జూలై 20ను అంతర్జాతీయ చంద్ర దినోత్సవంగా ప్రకటించింది.


















