లవ్ బ్రేకప్‌.. హీరోపై చెప్పు విసిరిన అనుపమ?

ప్రతిపక్షం, జూలై 21: హీరో ధ్రువ్‌ విక్రమ్‌, నటి అనుపమ పరమేశ్వరన్‌ మధ్య ప్రేమ వ్యవహారం విషాదకరంగా ముగిసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల చెన్నైలోని ఓ స్టార్‌ హోటల్‌లో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్లు సమాచారం. ఈ క్రమంలో అనుపమ ధ్రువ్‌ను చెప్పుతో కొట్టినట్లు ప్రచారం జరుగుతోంది. మహిళలను బాధపెట్టే వ్యక్తులు ఎప్పటికీ బాగుపడరంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేసి అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ధ్రువ్‌ విధించే ఆంక్షలు, అతని పెత్తనాన్ని అనుపమ భరించలేకపోయారని ప్రచారం జరుగుతున్నప్పటికీ.. ఈ వ్యవహారంలో అసలు కారణాలు, ఎవరి తప్పు అన్నది స్పష్టంగా తెలియాల్సి ఉంది.

Spread the love

Related News

Latest News