ప్రతిపక్షం, జూలై 21: నీట్ పరీక్ష పేపర్ లీక్ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా స్పందించినట్లు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఈ అంశాన్ని ప్రస్తావించిన ప్రధాని.. పేపర్ లీక్ అనేది మహా పాపమని, ఇలాంటి క్షమించరాని నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నట్లు చెప్పారు.
భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేయాలని మోదీ సూచించినట్లు రిజిజు వెల్లడించారు. దేశ యువత భవిష్యత్తును కాపాడటమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ప్రధాని స్పష్టం చేసినట్లు తెలిపారు.


















