భక్తా.. సాహసమా? అడవి పందికి కుంకుమ పెట్టి పూజించిన యువతి

ప్రతిపక్షం, జూలై 21: తిరుమల నడక మార్గంలో ఓ యువతి అడవి పందికి కుంకుమ పెట్టి పూజ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అడవి పందిని శ్రీమహావిష్ణువు వరాహ అవతారంగా భావించిన ఆమె దాని దగ్గరకు వెళ్లి నుదుటిపై కుంకుమ పెట్టి నమస్కరించింది.

అడవి జంతువుకు అంత దగ్గరగా వెళ్లడం ప్రమాదకరమని పలువురు నెటిజన్లు హెచ్చరిస్తున్నారు. జంతువు ప్రశాంతంగా కనిపించినప్పటికీ ఎప్పుడు ఎలా స్పందిస్తుందో చెప్పలేమని, భక్తులు అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణులకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. యువతి భక్తిని కొందరు ప్రశంసిస్తుండగా.. మరికొందరు ఆమె చేసిన పని సాహసంతో కూడుకున్న ప్రమాదకర చర్యగా అభిప్రాయపడుతున్నారు.

Spread the love

Related News

Latest News