ప్రతిపక్షం, జూలై 21: సీజేఐ వ్యాఖ్యల నేపథ్యంలో సెటైరికల్ పార్టీగా ఆవిర్భవించిన సీజేపీ.. ఇప్పుడు పార్లమెంట్ రాజకీయాలను కుదిపేస్తోంది. గతంలో జరిగిన ఆందోళనలతో పోలిస్తే ప్రస్తుత జెన్-జెడ్ ఉద్యమం యువతలో వచ్చిన కీలక మార్పుకు సంకేతంగా, ప్రభుత్వ విధానాలకు హెచ్చరికగా నిపుణులు విశ్లేషిస్తున్నారు.
పైకి చూస్తే ఈ ఉద్యమం పరీక్షల నిర్వహణ, ప్రశ్నపత్రాల లీకేజీల అంశం చుట్టూనే సాగుతున్నట్లు కనిపిస్తున్నప్పటికీ.. ప్రభుత్వ వ్యవస్థల్లోని లోపాలు, సంస్థాగత వైఫల్యాలపై యువతలో పెరుగుతున్న ఆగ్రహానికి ఇది ప్రతీకగా మారిందని అభిప్రాయపడుతున్నారు. తొలుత విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను తొలగించాలన్న డిమాండ్‌తో మొదలైన ఆందోళన.. ఇప్పుడు ఏకంగా ప్రధాని రాజీనామా చేయాలన్న స్థాయికి చేరడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.



















