ప్రతిపక్షం, జూలై 21: నీట్ ప్రశ్నపత్రం లీక్ వ్యవహారానికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఢిల్లీలో నిరసనలు కొనసాగుతున్న వేళ.. టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. విద్యాశాఖ మంత్రికి బహుశా రాజీనామా లేఖ రాయడం తెలియదేమోనని ఎక్స్ వేదికగా సెటైర్ వేశారు.
ఆర్ఎస్ఎస్ కేవలం క్షమాభిక్ష పిటిషన్లు ఎలా రాయాలో మాత్రమే నేర్పుతుందంటూ ఆమె విమర్శించారు. ఇదిలా ఉండగా.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో సీజేపీ ఆధ్వర్యంలో ఢిల్లీలో నిరసనలు కొనసాగుతున్నాయి.



















