రాహుల్‌ గాంధీకి తమిళనాడు సీఎం విజయ్ మద్దతు

ప్రతిపక్షం, జూలై 22: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకోవడాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తీవ్రంగా ఖండించారు. ప్రతిపక్ష నాయకులను నిర్బంధించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆయన సామాజిక మాధ్యమం ద్వారా స్పందించారు.

ప్రతిపక్ష పార్టీలు చేపడుతున్న నిరసనలకు తమ పార్టీ పూర్తి మద్దతు ఉంటుందని విజయ్ స్పష్టం చేశారు. నీట్ పరీక్ష కారణంగా విద్యార్థులు, వారి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని పేర్కొంటూ, దేశవ్యాప్తంగా నీట్‌ను పూర్తిగా రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

అలాగే, విద్యార్థుల భవిష్యత్తును రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించవద్దని సూచించిన విజయ్, ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ప్రజలకు తప్పుడు హామీలు ఇవ్వడం మానుకోవాలని కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. NEET వ్యవస్థపై సమగ్ర పునర్విమర్శ చేసి విద్యార్థులకు న్యాయం చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

Spread the love

Related News

Latest News