విద్యార్థుల ఆందోళన ప్రజాస్వామ్య హక్కు.. కేంద్రంపై రాహుల్ గాంధీ విమర్శలు

ప్రతిపక్షం, జూలై 22: ప్రధాని నివాసం ముందు నిర్వహించిన నిరసనపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. విద్యార్థుల సమస్యలపై గళమెత్తడం ప్రజాస్వామ్య హక్కు అని పేర్కొంటూ, నిరసన తెలిపే వారిని ఉగ్రవాదులుగా చూడడం సరికాదని అన్నారు.

ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాహుల్ మాట్లాడుతూ, తనపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ఆరోపణలు చేసినా వాటిని పట్టించుకోనని స్పష్టం చేశారు. నిరసన సందర్భంగా పోలీసులు తనతో వ్యవహరించిన తీరుపై వ్యక్తిగతంగా బాధ లేదని, అయితే విద్యార్థులు ఎదుర్కొంటున్న అన్యాయం మాత్రం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని చెప్పారు.

విద్యార్థులు దేశానికి శత్రువులు కాదని, వారు దేశ భవిష్యత్తు అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. తమ హక్కుల కోసం ఆందోళన చేసే యువత గొంతును అణచివేయకుండా, వారి సమస్యలను ప్రభుత్వం వినాలని ఆయన కేంద్రాన్ని కోరారు. ప్రస్తుతం జరుగుతున్న నిరసనలు విద్యార్థుల భవిష్యత్తు, విద్యా వ్యవస్థ పరిరక్షణ కోసమేనని ఆయన వ్యాఖ్యానించారు.

Spread the love

Related News

Latest News