ప్రతిపక్షం, ఆగస్టు 07: హైదరాబాద్‌లో పదో తరగతి విద్యార్థినిపై లైంగిక దాడి జరిగిన ఘటన కలకలం రేపుతోంది. పోలీసుల వివరాల ప్రకారం, యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేటకు చెందిన నిరంజన్ (36)కు అదే ప్రాంతానికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. అనంతరం ఇద్దరూ మేడిపల్లి పరిసర ప్రాంతానికి వలస వచ్చి వేర్వేరు ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారు.
ఈ క్రమంలో మహిళకు చెందిన 16 ఏళ్ల కుమార్తెతో నిందితుడు పరిచయం పెంచుకున్నట్లు పోలీసులు తెలిపారు. బాలికను ప్రతిరోజూ పాఠశాలకు తీసుకెళ్లే క్రమంలో ఆమెపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.
బాలిక ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించిన అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నట్లు తెలిపారు. నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ఆధారాలు సేకరిస్తున్నారు.





























