[t4b-ticker]

ఆగస్టు 10న సీఎం రేవంత్ ‘వరుణ యాగం’

ప్రతిపక్షం, ఆగస్టు 07: తెలంగాణలో సమృద్ధిగా వర్షాలు కురిసి జలాశయాలు నిండాలని, రైతులకు అనుకూల పరిస్థితులు ఏర్పడాలని ఆకాంక్షిస్తూ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి వరుణ యాగం నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆగస్టు 10న నాగార్జునసాగర్ ఆనకట్ట వద్ద ప్రత్యేక యాగం నిర్వహించనున్నట్లు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.

ముఖ్యమంత్రి సూచనల మేరకు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం అర్చకులు, వేద పండితులు, సిద్ధాంతులు కలిసి యాగానికి శుభ ముహూర్తాన్ని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా సమృద్ధిగా వర్షాలు కురవడం, నదులు, చెరువులు, జలాశయాలు జలకళ సంతరించుకోవడం, రైతులకు సమృద్ధిగా పంటలు పండడం కోసం ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు తొలగి వ్యవసాయ రంగం మరింత బలోపేతం కావాలనే సంకల్పంతో ఈ వరుణ యాగాన్ని చేపడుతున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తన సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు.

Spread the love

Related News

Latest News