జిల్లాకు గద్దర్ పేరును నామకరణం చేయాలి
పాఠ్యపుస్తకాలలో గద్దర్ జీవిత చరిత్రను రాయాలి
తెలంగాణ సాంస్కృతిక చైర్పర్సన్ గుమ్మడి డాక్టర్ వెన్నెల
ప్రతిపక్షం ప్రతినిధి మెదక్ ఆగస్టు 07: గద్దర్ చరిత్ర నేటి యువతరానికి ఒక స్ఫూర్తి కావాలని నిత్యం పేద ప్రజల కోసం బడుగు బలహీన వర్గాల కోసం పరితపించే వ్యక్తి గద్దర్ ఆయన పాటలు దోపిడీ సమాజాన్ని ఎదిరించే విధంగా నేటి యువత కు స్ఫూర్తి కావాలని తెలంగాణ సాంస్కృతిక చైర్పర్సన్ గుమ్మడి డాక్టర్ వెన్నెల అన్నారు. శుక్రవారం మెదక్ జిల్లా కేంద్రంలో గద్దర్ మూడవ వర్ధంతి పురస్కరించుకొని ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసే స్థలంలో చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో దళిత ప్రజా సంఘాలు పలు రాజకీయ నాయకులు జర్నలిస్టులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాలల హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు బొమ్మల మైసయ్య జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి బండారు గంగాధర్. సీనియర్ జర్నలిస్టు బందుల నాగరాజులు మాట్లాడుతూ. మెదక్ జిల్లాలో గద్దర్ పేరును నామకర్థం చేయాలని రద్దరి విగ్రహాలకు ప్రభుత్వం ఏర్పాటు చేయాలని మెదక్ జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేస్తూ పాఠ్యపుస్తకాలలో గద్దర్ చరిత్రను రాయాలని వారు డిమాండ్ చేశారు ట్యాంక్‌బండ్ పైన గద్దర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని వారు తెలిపారు ఈ సందర్భంగా తెలంగాణ సాంస్కృతిక రథసారథి గుమ్మడి డాక్టర్ వెన్నెల మాట్లాడుతూ. ప్రపంచవ్యాప్తంగా గద్దర్ పాట ద్వారా ప్రజలను చైతన్య పరిచినా ప్రజా యుద్ధనౌక గద్దర్ అని. ఆయన జీవితాంతం పీడిత ప్రజల కోసం పోరాటం చేసిన వ్యక్తి గద్దర్ తన జీవితాంతం అణగారిన వర్గాల హక్కుల కోసం నిరంతరం పోరాడిన మహనీయుడని అని అన్నారు.
తన ఆట, పాటలతో దేశవ్యాప్తంగా ప్రజలను చైతన్యపరిచిన గద్దర్, ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ప్రజల్లో చైతన్యం నింపి ఉద్యమానికి ఊపిరి పోసిన గొప్ప ప్రజాకవి అని కొనియాడారు. గద్దర్ జన్మించిన మెదక్ జిల్లాకు ఆయన పేరును ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాలని ప్రజా సంఘాల తరఫున డిమాండ్ చేశారు. గద్దర్ ఆశయాలను భావితరాలు కొనసాగించాలని, ఆయన చూపిన సామాజిక న్యాయం మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నూతనంగా ఏర్పడిన మెదక్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు నర్సింహ చారి కార్యదర్శి సంగమేశ్వర్ లను. తెలంగాణ సాంస్కృతిక రథసారథి డాక్టర్ వెన్నెల అధ్యక్ష కార్యదర్శులను సన్మానించారు.
ఈ కార్యక్రమంలో మాలల హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్ష కార్యదరిలు బొమ్మల మైసయ్య ఆకుల పెంటయ్య. సీనియర్ జర్నలిస్టు బొందుగుల నాగరాజు.కాంగ్రెస్ పార్టీ జిల్లా.అధికార ప్రతినిధి గంగాధర్. మున్సిపల్ కౌన్సిలర్లు గంట సంపత్. జుబేర్. కాంగ్రెస్ నాయకుడు మహేందర్ రెడ్డి.మెదక్ జిల్లా టియుడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు శంకర్ దాయల్ చారి.రిటైర్డ్ ఉపాధ్యాయులు రాధా కిషన్.మనోహర్. ఇసాక్. రవిశంకర్. బీఎస్పీ రాష్ట్ర నాయకులు అప్పాజీపల్లి సురేష్. ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకుడు అస్తరు గల్లా బాల్ రాజు. గజ్జల ప్రేమ్ కుమార్. దాసు. మెదక్ . ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నరసింహ చారి ప్రధాన కార్యదర్శి సంగమేశ్వర్. దళిత ప్రజా సంఘాల నాయకులు జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు.
































