ప్రతిపక్షం ప్రతినిధి మెదక్ ఆగస్టు 18: బహుజన నాయకుడు, పోరాట యోధుడు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుబడిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలను భావితరాలకు తెలిసేలా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ కోరారు.సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376 వ జయంతిని పురస్కరించుకుని పసుపులేరు ఒడ్డున రేణుక ఎల్లమ్మ ఆలయం వద్ద ఉన్న సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ముఖ్యఅతిథిగా విచ్చేసి పూలమాలలు వేసి బి.సి.అధికారులు, బి.సి.కులసంఘాలు, ఇతర కులసంఘ నాయకులతో బి.సి.సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ. జిల్లా కవులు, కళాకారులకు నిలయమని, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జీవిత చరిత్ర రచించి భావితరాలకు పుస్తక రూపంలో అందించాలన్నారు.
అణగారిన వర్గాల, శ్రమజీవుల కష్టాన్ని దోచుకునే వారిని ఎదిరించి పోరాడి సమాజ శ్రేయస్సు కోసం నిరంతరం తపించిన మహానీయుడని కొనియాడారు. చైతన్యానికి స్ఫూర్తి నిచ్చిన పోరాట యోధుని గాధలు ప్రతి ఒక్కరికి తెలియజేయాలన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్ , బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ ఉపేందర్, బీసీ వెల్ఫేర్ సహాయ అధికారి గంగా కిషన్, ఎక్సైజ్ సూపర్ ఇండెంట్ , నరసింహారెడ్డి, బీసీ సంక్షేమ సంఘం మెదక్ జిల్లా అధ్యక్షులు నోముల శ్రీకాంత్, గౌడ సంఘం జిల్లా అధ్యక్షులు రమేష్ గౌడ్, బిసి కుల సంఘ ప్రతినిధులు దామోదర్ గౌడ్ , జనార్దన్ గౌడ్ , కృష్ణ గౌడ్ , చింతకింది కృష్ణగౌడ్ , లక్ష్మీనారాయణ గౌడ్ ఇతర కుల సంఘాల ప్రతినిధులు బీసీ సంక్షేమ శాఖ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.































