[t4b-ticker]

అలియాబాద్‌లో ‘ఉల్లాస అమ్మకు అక్షరమాల’ శిక్షణ

ప్రతిపక్షం, ఆగస్టు 20, శామీర్‌పేట్: అక్షరాస్యతను పెంపొందించడంతో పాటు ప్రజలను విద్యా కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయడమే లక్ష్యంగా ‘ఉల్లాస అమ్మకు అక్షరమాల’ కార్యక్రమంపై శిక్షణా కార్యక్రమాన్ని అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించారు. TOSSలో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో అధికారులు, రిసోర్స్ పర్సన్స్ (RPలు), అంగన్‌వాడీ టీచర్లకు కార్యక్రమం అమలు విధానంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్‌పర్సన్ కంటం శిరీష కృష్ణారెడ్డి, PD DRDA సుభాష్‌రావు, DD అడల్ట్ ఎడ్యుకేషన్ అనిత, మున్సిపల్ కమిషనర్ ఎన్. వెంకట్‌రెడ్డి, TOSS కోఆర్డినేటర్ సత్యనారాయణ, TLF అధ్యక్షురాలు లావణ్య, ADMC ఉమేష్, CC నాగశ్రీతో పాటు RPలు, అంగన్‌వాడీ టీచర్లు హాజరయ్యారు.

ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. సమాజంలో అక్షరాస్యతను పెంపొందించడం, విద్యకు దూరంగా ఉన్న వారిని విద్యా కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయడం ‘ఉల్లాస అమ్మకు అక్షరమాల’ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని తెలిపారు. కార్యక్రమం అమలు విధానం, లక్ష్యాలు, ప్రజలకు అందించాల్సిన సేవలపై సిబ్బందికి వివరించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ విద్యా అవకాశాలు అందేలా క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేయాలని అధికారులు సూచించారు. కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేసేందుకు RPలు, అంగన్‌వాడీ సిబ్బంది చురుగ్గా పనిచేయాలని కోరారు.

Spread the love

Related News

Latest News