[t4b-ticker]

గంజాయి సేవిస్తూ పోలీసులకు పట్టుబడిన ముగ్గురు యువకులు

ప్రతిపక్షం బూర్గంపహాడ్, ఆగస్టు 23: బూర్గంపహాడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తాళ్ల గొమ్మూరు ఐటీసీ జామాయిల్ ప్లాంటేషన్ ప్రాంతంలో గంజాయి సేవిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారికి వైద్య పరీక్షలు నిర్వహించగా గంజాయి సేవించినట్లు నిర్ధారణ కావడంతో వారిని భద్రాచలంలోని రిహాబిలిటేషన్ కేంద్రానికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గడికొప్పుల శశికుమార్, సోము సీతారామిరెడ్డి, మహమ్మద్ అఫ్రోజ్ అనే ముగ్గురు వ్యక్తులు గంజాయి సేవిస్తూ పట్టుబడ్డారు. మాదకద్రవ్యాల వినియోగం వ్యక్తిగత ఆరోగ్యంతో పాటు కుటుంబాలు, సమాజంపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుందని పోలీసులు పేర్కొన్నారు.ఈ సందర్భంగా బూర్గంపహాడ్ పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ తమ పరిసర ప్రాంతాల్లో ఎవరైనా గంజాయి లేదా ఇతర మాదకద్రవ్యాలు సేవిస్తున్నట్లు,విక్రయిస్తున్నట్లు సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు.

Spread the love

Related News

Latest News