ప్రతిపక్షం, ఆగస్టు 28, హైదరాబాద్: రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పలువురు మహిళా నేతలు, విద్యార్థినులు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో ఈ కార్యక్రమం జరిగింది.
మంత్రులు ధనసరి అనసూయ సీతక్క, కొండా సురేఖ, మహిళా కమిషన్ చైర్పర్సన్ గద్వాల విజయలక్ష్మి, కమిషన్ సభ్యులు, వివిధ కార్పొరేషన్ల చైర్పర్సన్లు, బ్రహ్మకుమారీస్ ప్రతినిధులు, మహిళా కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రిని కలిసి రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ సీఎంతో ఆత్మీయంగా మాట్లాడారు.
అదే సమయంలో మలక్‌పేట్ ప్రభుత్వ అంధ బాలికల ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థినులు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి రాఖీలు కట్టడం ప్రత్యేకంగా నిలిచింది. విద్యార్థినులు ప్రేమాభిమానాలతో రాఖీలు కట్టి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
మహిళా నేతలు, వివిధ సంస్థల ప్రతినిధులతో పాటు విద్యార్థినులు కూడా సీఎం నివాసానికి వచ్చి రాఖీలు కట్టడంతో రక్షాబంధన్ సందర్భంగా అక్కడ ఆత్మీయ వాతావరణం నెలకొంది.

































