ప్రతిపక్షం మునుగోడు/హైదరాబాద్, ఆగస్టు 28: అన్నాచెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల మధ్య ప్రేమ, ఆప్యాయత, అనుబంధానికి ప్రతీక అయిన రాఖీ పండుగను మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి నివాసంలో ఘనంగా జరుపుకున్నారు.తన నలుగురు సోదరీమణులు రాజ్ గోపాల్ రెడ్డి కి రాఖీలు కట్టి ఆశీర్వదించారు. తన అక్కల కుటుంబ సభ్యులతో కలిసి సంప్రదాయబద్ధంగా జరుపుకున్న రాఖీ పండుగలో తన మనుమరాలు వాన్యతో కలిసి రాఖీ కట్టించుకున్నారు.అనంతరం మునుగోడు నియోజకవర్గంతో పాటు వివిధ నియోజకవర్గాల నుండి వచ్చిన సోదరీమణులు రాజ్ గోపాల్ రెడ్డి కి రాఖీ కట్టి ఆశీర్వదించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ గోపాల్ రెడ్డి మాట్లాడుతూ… కుటుంబ వ్యవస్థకు, భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు రాఖీ పౌర్ణమి ఎంతో ప్రాధాన్యత కలిగిన పండుగ అని అన్నారు. సోదరులు తమ సోదరీమణుల రక్షణ, గౌరవం, భద్రతకు ఎల్లప్పుడూ అండగా నిలవాలని, సోదరీమణులు తమ కుటుంబాల్లో ప్రేమానురాగాలను మరింత పెంపొందించాలని ఆకాంక్షించారు.ఈ రాఖీ పౌర్ణమి ప్రతి కుటుంబంలో సంతోషం, శాంతి, సౌభ్రాతృత్వం, ఐక్యత నింపాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షిస్తూ… మునుగోడు నియోజకవర్గంతో పాటు తెలంగాణ రాష్ట్ర ఆడపడుచులకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు.

































