*పెండింగ్ కేసుల పరిష్కారంలో వేగం పెంచాలి.. రౌడీషీటర్లపై నిఘా ఉంచాలి.
*నాణ్యమైన దర్యాప్తుతోనే బాధితులకు న్యాయం. మెరుగైన సేవలు అందించాలి .
*చండూరులో శాంతిభద్రతల పరిరక్షణకు సమన్వయంతో పనిచేయాలి.
*నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్.
ప్రతిపక్షం, చండూరు సెప్టెంబర్ 18: నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ గారు శుక్రవారం చండూర్ పోలీస్ స్టేషన్, సర్కిల్ ఆఫీస్ ను వార్షిక తనిఖీలో భాగంగా పరిశీలించారు.ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్కు చేరుకున్న జిల్లా ఎస్పీ గారికి పోలీస్ సిబ్బంది గౌరవ వందనం సమర్పించారు. అనంతరం పోలీస్ స్టేషన్ పరిసరాలు, రిసెప్షన్, సిబ్బంది విధుల నిర్వహణ, రికార్డు గదులు, సీసీ కెమెరాల పనితీరు తదితర అంశాలను ఎస్పీ గారు పరిశీలించారు.
ఈ సందర్భంగా స్టేషన్ లోని రికార్డులు, కేసుల పురోగతి, రిసెప్షన్ మేనేజ్మెంట్, ఉమెన్ హెల్ప్ డెస్క్, లాకప్ రూం, సీసీటీఎన్ఎస్ పనితీరు, సిబ్బంది హాజరును పరిశీలించారు. పెండింగ్ కేసులను త్వరితగతిన పూర్తి చేసి బాధితులకు సత్వర న్యాయం అందించాలని ఆదేశించారు.
పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరించాలని, ప్రతి ఫిర్యాదుపై తక్షణమే స్పందించాలని సూచించారు. రౌడీషీటర్లు, బెయిల్ పై ఉన్న నేరస్థులపై నిఘా ఉంచాలని, రాత్రివేళల్లో పెట్రోలింగ్, నాకాబందీ తనిఖీలు ముమ్మరం చేయాలని ఆదేశించారు.
డయల్ 100 కాల్స్ కు తక్షణమే స్పందించాలని, బ్లూకోల్ట్స్, పెట్రో కార్స్ 24×7 గస్తీ నిర్వహించాలని, సీసీ కెమెరాల ఏర్పాటుపై దృష్టి పెట్టాలని సూచించారు. సైబర్ నేరాలు, డ్రగ్స్, గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలన్నారు.చండూరు పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలను నాటారు . సిబ్బందికి యూనిఫార్మ్స్ , సెఫ్టీ కిట్లను అందించారు.
ప్రజల భద్రతే పోలీస్ శాఖ ప్రధాన బాధ్యత అని, ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేస్తూ చండూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతిభద్రతలను కాపాడాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ గారు తెలిపారు.ఈ వార్షిక తనిఖీలో ఎస్పీ గారి వెంట నల్లగొండ డిఎస్పీ శివరాం రెడ్డి, చండూర్ సీఐ రాము, డి.సి. ఆర్.బి సిఐ శ్రీను నాయక్,ఎస్.ఐ శివకుమార్ సంబంధిత పోలీస్ అధికారులు, చండూర్ పోలీస్ స్టేషన్ సిబ్బంది ఉన్నారు.
































