[t4b-ticker]

పలు వినాయక మండపాలను సందర్శించిన పీసరి మహిపాల్ రెడ్డి

ప్రతిపక్షం, సెప్టెంబర్ 19, శామీర్‌పేట్: మల్కాజ్గిరి కార్పొరేషన్ పరిధిలోని శామీర్‌పేట్ డివిజన్‌లో వినాయక చవితి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా శామీర్‌పేట్, బోమరాశిపేట గ్రామాల్లో ఏర్పాటు చేసిన సుమారు 30 వినాయక మండపాలను టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పీసరి మహిపాల్ రెడ్డి, శామీర్‌పేట్ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు నక్క సందీప్ గౌడ్‌తో కలిసి సందర్శించారు.

మండపాల నిర్వాహకులు, కాంగ్రెస్ నాయకుల ఆహ్వానం మేరకు ఆయా మండపాలకు వెళ్లిన మహిపాల్ రెడ్డి గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం మండపాల నిర్వాహకులు, భక్తులతో మాట్లాడి ఉత్సవాల ఏర్పాట్లను తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా పీసరి మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ.. వినాయకుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షుడు వైఎస్ శంకర్ గౌడ్, మాజీ ఎంపీటీసీ ఇందిర, గ్రామ అధ్యక్షులు ఆంజనేయులు, అశోక్, యువజన కాంగ్రెస్ నాయకులు నాగరాజు, భరత్, మహేష్, భాగ్యనగర్ ఉత్సవ సమితి సభ్యులు రాకేష్, శ్రీకాంత్ రెడ్డి, నర్సింహ రెడ్డి, NSUI రాష్ట్ర కార్యదర్శి దీపక్ రెడ్డి, శామీర్‌పేట్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు నవీన్, NSUI అధ్యక్షుడు రోహిత్ రెడ్డి, ప్రజ్వల్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News