Trending Now

నేటి నుంచే ‘ఇంటర్’ హాల్‌టికెట్స్ రిలీజ్..

ప్రతిపక్షం, హైదరాబాద్: తెలంగాణ ఇంటర్మీడియట్ వార్షిక పరీక్ష హాల్ టిక్కెట్లను నేడు తెలంగాణ సర్కార్ విడుదల చేసింది. హాల్ టిక్కెట్లు ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. మొదటి సంవత్సరం విద్యార్థులు హాల్ టికెట్ నంబర్‌తో థియరీ పరీక్ష హాల్ టిక్కెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. రెండవ సంవత్సరం వారు రెండవ సంవత్సరం హాల్ టిక్కెట్ నంబర్‌తో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. హాల్ టిక్కెట్ల లో ఫోటోలు, సంతకాలు ఇతర సవరణలను కళా శాల ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్లి వాటిని సరిదిద్దుకునే సౌకర్యాన్ని కలిపించారు. ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. ఫిబ్రవరి 28 నుండి మార్చి 19 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రతిరోజూ ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ ఏడాది 9.8 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరుకానున్నారు.

Spread the love

Related News

Latest News