రాజీవ్ సేవలు చిరస్మరనీయం..
షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
ప్రతిపక్షం, షాద్ నగర్, మే 21: ఐటీ రంగ వృద్ధికి రాజీవ్ గాంధీ బాటలు వేశారని, దేశానికి ఆయన చేసిన సేవలు చిరస్మరనీయమని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కొనియాడారు. మంగళవారం షాద్ నగర్ లో మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు చెన్నయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే రాజీవ్‌గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధానిగా దేశానికి ఆయన చేసిన సేవలను అమోఘమన్నారు. రాజీవ్ గాంధీ ఆశయాలను ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కొనసాగించాలని సూచించారు. రాజీవ్ గాంధీ ఆశయాల అడుగుజాడలలో తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలో సోనియాగాంధీ, రాహుల్ గాంధీల ఆశీస్సులతో ప్రజాపాలన అందిస్తున్నామని ఎమ్మెల్యే శంకర్ అన్నారు.
అంతకుముందు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మహమ్మద్ అలీ ఖాన్ బాబర్, ఎంపీపీ ఖాజా అహ్మద్ ఇద్రీస్, జడ్పీటీసీ వెంకటరామిరెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, జమ్రుద్ ఖాన్, పురుషోత్తం రెడ్డి, కౌన్సిలర్ కృష్ణవేణి, జాంగారి రవి, కేశంపేట మండలం నాయకులు జగదీష్, గూడ వీరేశం, శ్రీధర్ రెడ్డి, సురేష్ రెడ్డి కొత్తూరు మండల పార్టీ అధ్యక్షుడు హరినాథ్ రెడ్డి, లింగారెడ్డి గూడా అశోక్, ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.