ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీసీ కులాలకు చెందినవారు కావడంలో దేశంలో ఉన్న మెజార్టీ బీసీలు బీజేపీ కి మద్దతు ఇచ్చారు. కావున కేంద్ర మంత్రివర్గంలో బీసీలకు 50% మంత్రి పదవులు, ముఖ్యమైన శాఖలు బీసీలకు కేటాయించాలని 13 బీసీ సంఘాలు డిమాండ్ చేశాయి. ఇవాళ 13 బీసీ సంఘాల సమావేశానికి గుజ్జ సత్యం, గుజ్జ కృష్ణ అధ్యక్షతన సమావేశనికి ఈ క్రింది డిమాండ్లు నెరవేర్చలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీలు మెజార్టీ శాతం నరేంద్ర మోడీని చూసి ఓట్లు వేశారు. అందుకే 8 సీట్లు గెలిచారు. మన రాష్ట్రంలో 3 మంత్రి పదవులు బీసీలకు కేటాయించాలని కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీసీల డిమాండ్లు నెరవేర్చడానికి ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. మంత్రివర్గంలో ప్రాధాన్యత ఇవ్వడంతో కాకుండా దేశంలోనే బీసీలకు 70 కోట్ల మందికి విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ అభివృద్ధికి విధానపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
కేంద్ర ప్రభుత్వం BC వ్యతిరేకత మార్చుకోవాలని ఆర్. కృష్ణయ్య హెచ్చరించారు. బీసీలకు ఏ రంగంలో కూడా ప్రజాస్వామిక విద్యా, ఉద్యోగ, ఆర్థిక వాటా ఇవ్వలేదన్నారు. అలాగే రాజకీయ, పారిశ్రామిక జనాభా ప్రకారం వాటా ఇవ్వడం లేదు. 76 సంవత్సరాలుగా బీసీలకు అన్యాయం చేశారు. ఇప్పటికీ కూడా న్యాయం చేయాలని ఆలోచించడం లేదు. అణిచివేత, దోపిడీ, పీడన, వివక్ష, అన్యాయం, బానిసత్వకు వ్యతిరేకంగా మానవ జాతీ తిరుగుబాట్లు జరుగుతున్న చరిత్రను మనం చూస్తున్నాం. భారతదేశంలో అనేక సెంటిమెంట్లతో ఇంకా ప్రజలను తప్పుదారి పట్టించడం, మభ్య పెడుతామనే ఆలోచనలు మానుకోవాలని హెచ్చరించారు. ప్రజలను అన్ని రంగాలలో అభివృద్ధి పరచాలని దృడ నిర్ణయం చేయడానికి జాతీయ పార్టీలు ముందుకు రావాలని ముఖ్యంగా బీజేపీ పార్టీ రావాలని ఆర్ కృష్ణయ్య కోరారు.
స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలు గడిచిన ఈ దేశంలో పేద బీసీ కులాలకు అన్ని రంగాలలో సమాన వాటా లభించడం లేదు. ఇంకా ఈ దేశంలో ప్రపంచ బ్యాంక్ సర్వే ప్రకారం 49 శాతం జనాభా పేదరికం క్రింద జీవిస్తున్నారు. 29 శాతం ప్రజలు నిరక్ష రాశ్యులుగా చదువుకో నోచుకోకుండా ఉన్నారు. BC జాబితాలోని 2652కులాలలో 1849 కులాలు S.S.C వరకు కూడా చదువుకోలేదు. ప్రపంచంలో అన్ని దేశాలు శరవేగంతో అభివృద్ధి చెందుతుంటే మనదేశంలో నిరక్షరాస్యత, పేదరికం, అమాయకత్వం ప్రజలు నలిగిపోతున్నారు. కేంద్రంలో అనేక ప్రభుత్వాలు మారుతున్న బి.సి.ల వాటా బి.సి.లకు లభించడం లేదు.
కొత్త ప్రభుత్వం బీసీల కొరకు ఈ క్రింది డిమాండ్లు పరిష్కరించాలని కోరారు.
1) పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టి చట్ట సభలలో బి.సి లకు 50 శాతం రిజవేషన్లు కల్పించాలి.
2) కేంద్రంలో బీసీ లకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్ ప్రీ –మెట్రిక్ స్కాలర్ షిప్ స్కీములు మరియు ఫీజుల రియంబర్స్ మెంట్ స్కీములకు సాచురేషన్ పద్ధతిలో ప్రవేశపెట్టాలి. రాష్ట్రాలకు 60శాతం మ్యాచింగ్ గ్రాంటు ఇవ్వాలి. దేశ వ్యాప్తంగా బీసీ హాస్టళ్ళు –గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయాలి.
3) జాతీయ బీసీ ఫైనాన్స్ కార్పోరేషన్ రుణాలకు విధించిన షరతులను ఎత్తివేయాలి. బీసీ కార్పొరేషన్ బడ్జెట్ ఏటా 50 వేల కోట్లు కేటాయించి ప్రతి కుటుంబానికి 10 లక్షల నుంచి 50 లక్షల వరకు 80 శాతం సబ్సిడి తో రుణాలు మంజూరు చేయాలి.
4) కేంద్ర ప్రభుత్వ శాఖలలో, ప్రభుత్వ రంగ సంస్థలలో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగ ఖాళీలు, 1467 IAS, 964 IPS ఉద్యోగాలు భర్తీ చేయాలి.
5) బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలి. ఇందుకు రాజ్యాంగ సవరణ చేయాలి.
6) పంచాయతీరాజ్ సంస్థ బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుండి 56 శాతం కు పెంచాలి. ఈ రిజర్వేషన్లకు రాజ్యాంగ భద్రత కల్పించాలి.
7) త్వరలో జరిగే జనగణనలో “కుల గణన చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం.
8) బీసీ ల విద్యా, ఉద్యోగ రిజర్వేషన్ల పై ఉన్న క్రిమీ లేయర్ ను తొలగించాలి.
9) కేంద్రంలో బీసీ లకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి. బీసీ ల అభివృద్ధికి ప్రత్యేక స్కీములను రూపొందించాలి.
10) ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ మాదిరిగా బీసీ లకు సామాజిక రక్షణ, భద్రత కల్పించడానికి “బీసీ యాక్టు”ను తీసుకరావాలి.
11) రాష్ట్రంలో కేంద్రంలో విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లను బీసీ ల జనాభా ప్రకారం 27 శాతం నుండి 56 శాతం కు పెంచాలి.
12) ప్రెవేట్ రంగ పరిశ్రమలలో, కంపెనీలలో తదితర ప్రెవేట్ రంగాలలో ఎస్సీ/ఎస్టీ/బీసీ లకు జనాభా ప్రకారం ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు పెట్టాలి.
13) సుప్రీమ్ కోర్టు- హై కోర్టు జడ్జీల నియామకాలలో ఎస్సీ/ఎస్టీ/బీసీ లకు జనాభా ప్రకారం రిజర్వేషన్లు పెట్టాలి.
14) బీసీల విద్యా, ఉధ్యోగా, ఆర్ధికాభివృద్ధికి రెండు లక్షాల కోట్ల బడ్జెట్ ను కేంద్ర ప్రభుత్వం కేటాయించాలి.