CM Chandrababu: తెలంగాణలో టీడీపీ బలోపేతం, వ్యూహంపై చంద్రబాబు చర్చలు

CM Chandrababu Focus on Telangana: తెలంగాణలో టీడీపీ సభ్యత్వ నమోదుపై దృష్టి సారించాలని ఆ పార్టీ నేత చంద్రబాబు నాయడు నాయకులను ఆదేశించారు. ఎన్టీఆర్ భవన్‌లో ఆ పార్టీ నేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ మేరకు తెలంగాణలో పార్టీ బలోపేతం, స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. పార్టీలో చురుగ్గా ఉండి పనితీరు బాగున్న వారికే ప్రాధాన్యం ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారు.

కాగా, అంతకుముందు ఉన్న అన్ని కమిటీలను చంద్రబాబు రద్దు చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. తెలంగాణలో టీడీపీ బలోపేతానికి కృషి చేయనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో త్వరలోనే ఆన్‌లైన్ పార్టీ సభ్యత్వానికి ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రధానంగా యువతకు ఎక్కువగా ప్రాధాన్యత కల్పించాలని ఆదేశించారు. అయితే నెలలో రెండుసార్లు తెలంగాణకు వస్తానని, అందరి అభిప్రాయాలు తీసుకుంటానని స్పష్టం చేశారు.

Spread the love

Related News

Latest News