ప్రతిపక్షం, వెబ్డెస్క్: రేవ్ పార్టీ కేసులో అరెస్టైన నటి హేమను బెంగళూరు పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. బెంగళూరులో రేవ్ పార్టీలో పాల్గొనడంతో పాటు డ్రగ్స్ తీసుకున్నారనే అభియోగాలతో ఆమెను సీసీబీ పోలీసులు అరెస్ట్ చేసి బుధవారం ఆనేకల్ కోర్టులో హాజరుపర్చారు. ఆమెను ఒక రోజు విచారించేందుకు కోర్టు పోలీసులకు అనుమతిచ్చింది. ఇవాళ సాయంత్రం ఆమెను తిరిగి కోర్టులో హాజరుపర్చనున్నారు.
మరోవైపు నటి హేమను మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) నుంచి సస్పెండ్ చేయాలని యోచిస్తున్నారు. పోలీసుల నివేదికలో హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ కావడంలో ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. బుధవారం జరిగిన ‘మా’ సమావేశంలో హేమ సస్పెండ్ విషయమై చర్చ జరిగింది. అయితే, తుది నిర్ణయానికి ఇంకా రాలేదు. ఈ విషయమై అధ్యక్షుడు మంచు విష్ణు గురువారం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సన్నిహిత వర్గాలు తెలిపాయి.