ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: టీజీపీఎస్సీ వద్ద బీఆర్ఎస్ విద్యార్థి సంఘం ఆందోళనకు దిగింది. రహదారిపై బైఠాయించి విద్యార్థి సంఘ నేతలు నిరసన తెలిపారు. అక్టోబర్‌లో మెగా డీఎస్సీ నిర్వహించాలనే డిమాండ్‌తో వారు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో విద్యార్థి సంఘ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
DSC, గ్రూప్-2కి కేవలం ఒక్క రోజు గ్యాప్ మాత్రమే ఉందని గుర్తుచేస్తున్నారు. గ్రూప్-2, 3కి ఒకే సిలబస్ ఉన్నందున డిసెంబర్లో నిర్వహిస్తే నిరుద్యోగులు ఒత్తిడి లేకుండా సజావుగా ప్రిపేర్ అయ్యే అవకాశం ఉంటుందన్నారు. అలాగే అక్టోబర్‌లో మెగా డీఎస్సీ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో సీఎం జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.