ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: కంచన్ జంగా ఎక్స్‌ప్రెస్‌ను గూడ్స్ రైలు ఢీకొన్న ప్రమాదం నేపథ్యంలో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ట్రైన్ యాక్సిడెంట్‌ల నుంచి రక్షణ కల్పించే ఆటోమెటిక్ వ్యవస్థ(ఏటీపీ) అందుబాటులోకి వచ్చే వరకు వందే భారత్, గతిమాన్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల గరిష్ట వేగాన్ని 160 కిలో మీటర్ల నుంచి 130 కిలో మీటర్లకు తగ్గించాలని నిర్ణయించింది. ప్రస్తుతం నిజాముద్దీన్- ఆగ్రా మధ్య ఒక గతిమాన్ ఎక్స్ ప్రెస్, రెండు వందేభారత్ రైళ్లు గంటకు 160 కిలోమీటర్ల వేగంతో వెళ్తుండగా.. ఏటీపీ వ్యవస్థ స్టార్ట్ అయ్యే వరకు వీటి వేగాన్ని 130 కిలో మీటర్లకు కుదించారు.