ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సామాజిక ఫించన్ల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. వాయుగుండం కారణంగా రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నా లెక్క చేయకుండా సచివాలయ సిబ్బంది లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్లు అందజేస్తున్నారు. రేపు ఆదివారం కావడంతో సెప్టెంబర్ నెల పెన్షన్లను ఒక్క రోజు ముందుగానే ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించడంతో ఇవాళే ఈ కార్యక్రమం చేపట్టారు. దీంతో ఈ నెలలోనే రెండోసారి లబ్దిదారులు పెన్షన్లు అందుకుంటున్నట్లు అవుతోంది. ఇప్పటి వరకు 56 శాతం పింఛన్ల పంపిణీ పూర్తయింది. అతి భారీ వర్షాలు కురుస్తున్న ప్రాంతాల్లో సెప్టెంబర్ 2వ తేదీన ఫించన్లు పంపిణీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు.