ప్రతిపక్షం ప్రతినిధి, నిర్మల్, మే 20 : నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రముఖ హోటల్లో జూదమాడుతున్నట్లు పక్కా సమాచారం అందుకున్న నిర్మల్ జిల్లా ఎస్పీ డా.జి. జానకి షర్మిల నిర్మల్ పట్టణ సీఐ అనిల్ కుమార్ ను ఆదేశించారు. ఎస్పీ ఆదేశాలు,సమాచారం మేరకు ఆదివారం రాత్రి నిర్మల్ జిల్లా కేంద్రంలో ఉన్న ఓ ప్రముఖ హోటల్ లో జూదమాడుతున్న 12 మందిని పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుండి రూ.16.550 లు నగదు, 12 మొబైల్ ఫోన్లు,నాలుగు ద్విచక్ర వాహనాలు,రెండు కార్లను స్వాధీనపరుచుకున్నారు. ఇందులో జుట్టు దినేష్ జగడం రాజు, నానం సాయికృష్ణ, ఆదుముళ్ళ వినోద్, సూరం నిఖిల్ ,కోరు కంటి రాకేష్ ,బట్టు రాజు, ఉల్లిగడ్డల రమేష్, పరుషరౌత బాలకృష్ణ ,సల్లా రాఘవేంద్ర, మంత్రి సుధీర్, రావుల శ్రీనివాస్ యాదవ్ లను అరెస్టు చేసి కేసును దర్యాప్తు చేస్తున్నట్టు పట్టణ సిఐ అనిల్ కుమార్ వివరించారు.