ఛత్తీస్‌ఘడ్‌లో మరోసారి భారీ ఎన్ కౌంటర్ జరిగింది. పోలీసులు, మావోయిస్టుల భీకరంగా ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 9 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని పోలీస్ అధికారులు పేర్కొన్నారు. దంతెవాడ, బీజాపూర్ జిల్లాల సరిహద్దు ప్రాంతాలైన భైరంగాడ్ పోలీస్ స్టేషన్, దంతెవాడ పోలీస్ స్టేషన్ పరిధి అటవీ ప్రాంతాల్లో ఈ ఘటన జరిగింది. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో భద్రతా బలగాలు భారీగా పేలుడు పదార్ధాలు, అత్యాధునిక ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.