Trending Now

కేటీఆర్ వ్యాఖ్యలకు మంత్రి జూపల్లి కౌంటర్

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: శ్రీదర్ రెడ్డిపై హత్య ఘటనపై గాంధీ భవన్‌లో జూపల్లి కృష్ణారావు మంత్రి స్పందించారు. నిన్న వనపర్తిలో జరిగిన ఘటనను మేము ఖండిస్తున్నామని.. పూర్తి వివరాలు తెలియకుండా నిన్న జరిగిన హత్య కేసులో నా హస్తం ఉందని కేటీఆర్ ఎలా మాట్లాడుతారని.. మాజీ మంత్రి కేటీఆర్‌పై ఆయన ఫైరయ్యారు. శ్రీదర్ రెడ్డి కి రాజకీయాలకు సంబంధం లేదు. మాజీ ఎమ్మెల్యేకు ఆయన చుట్టం. ఆ ప్రాంతంలో శ్రీదర్ రెడ్డి వలన చాలా కుటుంబాలు బాధపడ్డాయని.. శ్రీదర్ రెడ్డి కుటుంబ, ఆస్తి తగాదాలు ఉన్నాయని తెలిపారు. మాజీ ఎమ్మెల్యేతో ఆయనకు ఆర్థిక పరమైన సంబంధాలు ఉన్నాయి. శ్రీదర్ రెడ్డిపై హత్య ఘటనపై పూర్తి విచారణ చేయిస్తాము. నేను బీఆర్‌ఎస్ పార్టీ మారిన నుండి నాపై బీఆర్‌ఎస్ నేతలు కక్ష పెట్టుకున్నారు. అందుకే నాపై వాళ్ళ పేపర్‌లో తప్పుడు వార్తలు రాశారు.

గతంలో మా నియోజక వర్గంలో ఒక రాజకీయ హత్య జరిగిందని అని నాపై ఆరోపించారు. దానికి నాకు ఏమి సంబంధం.. గతంలో జరిగిన హత్య కూడా భూ పంచాయతీ వలన జరిగింది. అవగాహన లేకుండా మాజీ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతున్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డిని నన్ను భర్తరఫ్ చేసినందుకు మిమ్మలని జనాలు భర్తరఫ్ చేశారు. నన్ను ప్రశ్నించే అర్హత కేటీఆర్ కు లేదు. నేరెళ్ళ ఘటనలో దళితులను హింసించిన వాళ్ళు నాపై మాట్లాడే అర్హత లేదు. కాంగ్రెస్ ప్రభుత్వంపై మాట్లాడే అంశాలు లేక ఇలాంటి ఫాల్స్ అలిగేషన్స్ మాపై చేస్తున్నారు.

గండ్ర పల్లి హత్య విషయంలో నాపై ఆరోపణలు చేశారు. అందులో నా పాత్ర లేదని పోలీస్ రిపోర్ట్ ఇచ్చింది. హత్య జరిగినప్పుడు నాపై ఆరోపణలు చేశారు. ఇప్పుడు నా ప్రమేయం లేదని పోలీస్ రిపోర్ట్ ఇచ్చింది. కనుక మీరు ఇప్పుడు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేటీఆర్, ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ కి సంసారం ఉండాలి.. నిజాయితీగా మాట్లాడాలి. లక్ష్మి పల్లి హత్య ఘటన జ్యుడీషియల్ విచారణ చేపట్టండి. నాకు ఏమి ఇబ్బంది లేదు. గండ్రపల్లి లో, లక్ష్మి పల్లిలో జరిగిన రెండు హత్యలపై అక్కడ ప్రజల దగ్గరికి వెళ్ళండి జనాలు చెపుతారు. నాపై ఇంకొక సారి తప్పుడు ఆరోపణలు చేస్తే మంచిగా ఉండదని ఆయన హెచ్చరించారు. ఆరోపణలు కాదు లక్ష్మి పల్లి చౌరస్తాకు రా.. జనాలు ఏమి చెపితే అది చేద్దాము.. కేటీఆర్, ప్రవీణ్ కుమార్ మీరు ఇద్దరు లక్ష్మి పల్లి కి రండి నేను వస్తాను.. నాపై బురద చల్లాలని చూస్తున్నారు. తప్పుడు ఆరోపణలు చేస్తే డిఫర్మేషన్ కేసులు వేస్తానని ఆయన హెచ్చరించారు.

Spread the love

Related News

Latest News