ప్రతిపక్షం, ప్రతినిధి హనుమకొండ, మే 14: లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో గత నెల రోజులుగా బిజీ బిజీగా గడిపిన నేతలు సోమవారం ఎన్నికలు ముగియడంతో ఎన్నికల బిజీ నుంచి ఊరట చెందారు. నిత్యం ప్రజలతో మమేకమవుతూ అవిశ్రాంతంగా ఎన్నికల్లో తమ అభ్యర్థి విజయమే లక్ష్యంగా కృషిచేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్చార్జీలు, ముఖ్య నేతలు ఎన్నికల వాతావరణం నుంచి బయటపడి ప్రశాంతత కోసం, గుళ్ళు, గోపురాలంటు రకరకాల రకరకాల ప్రదేశాలలో విడిది కోసం ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మంగళవారం వరంగల్ జిల్లాలోని ప్రముఖ దేవస్థానం శ్రీ భద్రకాళీ అమ్మవారిని తన కూతురు అనన్య రెడ్డితో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరెడ్డి మాట్లాడుతూ.. ప్రజలందరూ సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు.