ప్రతిపక్షం, వెబ్డెస్క్: దివంగత నేత నందమూరి హరికృష్ణ కుమార్తె నందమూరి సుహాసిని శనివారం సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఇవాళ ఉదయం ముఖ్యమంత్రి నివాసానికి చేరుకున్న సుహాసిని ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ, మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి సమక్షంలో సీఎం రేవంత్ రెడ్డికి మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. అయితే ఎంపీ ఎన్నికల వేళ సీఎంతో ఆమె భేటీ ఆసక్తిగా మారింది.