ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో సెషన్ లాభాల్లో దూసుకెళ్తున్నాయి. నిన్న తొలిసారిగా సెన్సెక్స్ 79వేల మార్క్, నిఫ్టీ 24వేల మార్క్ దాటగా ఈరోజు ఆ జోరును కొనసాగిస్తున్నాయి. 278 పాయింట్ల లాభంతో 79,519 వద్ద దూసుకెళ్తున్న సెన్సెక్స్ ఓ దశలో గరిష్ఠంగా 79,671కు చేరింది. నిఫ్టీ 100కుపైగా పాయింట్లు ఎగిసి 24,145 వద్ద ట్రేడవుతోంది. డాక్టర్ రెడ్డిస్, SBI, ONGC, టాటా మోటార్స్ నిఫ్టీ టాప్ గెయినర్లుగా ఉన్నాయి.