ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, ఏప్రిల్ 20 : ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మల్ లో ఆర్ట్స్ కోర్సులలో చరిత్రను అభ్యసిస్తున్న విద్యార్థులు క్షేత్ర పర్యటనలో భాగంగా సహాయ ఆచార్యులు డా. పి జి రెడ్డి ఆద్వర్యంలో శనివారం శ్యామ్ ఘడ్ ను సందర్శించారు. నిర్మల్ చరిత్రను విద్యార్థులకు వివరించారు. నిమ్మ నాయుడు అనే రాజు ఈ పట్టణాన్ని నిర్మించి “నిమ్మల” అని నామకరణం చేశాడు అని, కాల క్రమేణ నిమ్మల “నిర్మల్ ” గా మారి రాష్ట్రం లో పేరు గాంచిందని, ఈ పట్టణం లో ఆ కాలంనాటి కోటలు, కందకాలు, బురుజులు చూడదగ్గవని, నిర్మల్ చరిత్రకుయే కాకుండా కొయ్యబొమ్మలకు, చిత్రకళకు ప్రసిద్ధి అని, నిర్మల్ చారిత్రకంగా ప్రాధాన్యత కల్గిన ప్రాంతం, ఆదిమ మానవ సమాజపు ఆనవాళ్ళు లభించిన ప్రాంతాలలో నిర్మల్ ఒకటియని, చారిత్రకంగా చైతన్యవంతమైన పోరాటాలు జరిగిన ప్రాంతమని, భావితరాలకు చైతన్యానికి నిర్మల్ చరిత్ర ఉపయుక్తంగా ఉంటుందని Dr. పి జి రెడ్డి తెలిపారు. శ్రీనివాసరావు తన అశ్వదళంలో ఆరితేరిన అశ్వ సైన్యాధిపతి “ఎహతేశ్యాంజంగ్” పేరుతో గఢ్ నిర్మించాడు. ఇతడు గఢ్ నందు నివాసంగా ఉన్నందున అది “శ్యామ్ ఘడ్”గా ప్రసిద్ధి చెందింది. ఇది సోఫినగర్ ప్రాంతంలో ఉంది. శత్రుసైనికులు వస్తున్నట్లు తెలిస్తే సోన్ గఢ్ మీద వరిగడ్డి మంట పెట్టేవారు. ఆ మంటను చూచి శ్యామ్ ఘడ్ మీదున్న సైనికులు మంటపెట్టి బత్తీస్గఢ్ మీదున్న సైనికులకు సూచన ఇస్తుండేవారు. బత్తీస్గఢ్ మీద మంట పెట్టి ఖిల్లాగుట్ట రాజభవనం మీదున్న సైనికులకు తెలిపితే వారు జాగ్రత్త పడేవారు అని విద్యార్థులకు శ్యామ్ ఘడ్ గురించి Dr. పి జి రెడ్డి విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ క్షేత్ర పర్యటన లో సహాయ ఆచార్యులు కుంట శ్రీహరి, Dr. శంకర్, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.