పార్లమెంట్‌ ముట్టడి నేడూ కొనసాగుతుంది: అభిజీత్‌

ప్రతిపక్షం, జూలై 21: పార్లమెంట్‌ ముట్టడి నిరసన ఇవాళ కూడా కొనసాగుతుందని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కే తెలిపారు. నిన్న రాత్రి నిరసనల అనంతరం ఆందోళనకారులు తిరిగి జంతర్‌మంతర్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేసే వరకు జంతర్‌మంతర్‌ను వీడేది లేదని స్పష్టం చేశారు. మళ్లీ పార్లమెంట్‌ ముట్టడికి వెళ్తామని తెలిపారు. కాగా, తొలిరోజు ఆందోళనలు హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే.

Spread the love

Related News

Latest News