ఢిల్లీ నిరసనలపై రచయిత సంచలన వ్యాఖ్యలు.. ‘కాల్చి పడేయాలి’ అన్న మాటలపై తీవ్ర విమర్శలు

ప్రతిపక్షం, జూలై 28: ఢిల్లీలో కొనసాగుతున్న నిరసనలపై కేరళకు చెందిన రచయిత, న్యాయవాది టి.జి. మోహన్ దాస్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. నిరసనకారులపై కాల్పులు జరపాలని సూచించేలా ఆయన చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చకు కారణమయ్యాయి.

తనకు భద్రతా బాధ్యతలు అప్పగిస్తే జంతర్ మంతర్ పరిసరాల్లో నాలుగు కిలోమీటర్ల మేర కర్ఫ్యూ విధించి, నిరసనకారులను మూడు సార్లు ఖాళీ చేయాలని హెచ్చరిస్తానని ఆయన పేర్కొన్నారు. హెచ్చరికలను పట్టించుకోకపోతే కాల్పులకు ఆదేశాలు ఇస్తానని, కొందరు మరణించిన తర్వాత పరిస్థితి నాలుగు గంటల్లో అదుపులోకి వస్తుందని వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్యలు వెలుగులోకి రావడంతో పలు రాజకీయ వర్గాలు, సామాజిక సంస్థలు, నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో శాంతియుత నిరసనలు హక్కు అని, ఇలాంటి హింసను ప్రోత్సహించే వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యమని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

మోహన్ దాస్ వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుండగా, పలువురు ఆయన వ్యాఖ్యలను ఖండిస్తూ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Spread the love

Related News

Latest News