ప్రతిపక్షం, జూలై 29: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘రాకా’ సినిమా షూటింగ్‌కు విరామం ఇచ్చి హైదరాబాద్‌లో 900 మందికిపైగా అభిమానులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన అభిమానులను ప్రత్యక్షంగా కలుసుకోవడం ఎంతో హృదయాన్ని హత్తుకుందని ఆయన సామాజిక మాధ్యమం X వేదికగా పేర్కొన్నారు.
తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, కేరళ నుంచి అభిమానులు ఈ సమావేశానికి హాజరైనట్లు సమాచారం. అభిమానులతో మరింత సన్నిహితంగా ఉండేలా ఇకపై ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఇలాంటి ఫ్యాన్స్ మీట్ నిర్వహించాలనే ఆలోచనలో అల్లు అర్జున్ ఉన్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ ప్రత్యేక సమావేశం అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపింది.

















